కరోనాతో గేమ్స్‌ 

American Youth Conducted Coronavirus Party - Sakshi

ఇదో కొత్త రకం పైత్యం

కరోనా వైరస్‌తో ఆడుకునే ప్రమాదకరమైన ఆట

కరోనా మన గుమ్మం దాటి లోపలికి రావడం కాదు

మనమే ఎదురేగి కరోనాని కౌగిలించుకోవాలి

అమెరికాలో యువతరం కోవిడ్‌ పార్టీల్లో మునిగితేలుతోంది

కరోనా కేసుల్ని పెంచి పోషిస్తోంది

కోవిడ్‌ పార్టీల్లో మునిగితేలుతున్నఅమెరికా యువత

అలబామా, కెంటకీ రాష్ట్రాల్లో అధికం

వాషింగ్టన్‌: కోవిడ్‌ –19 కబంధ హస్తాల్లో చిక్కుకొని అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతుంటే అక్కడ యువతరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. కరోనా పార్టీలు చేసుకుంటూ కోరి మరీ వైరస్‌ను కౌగిలించుకుంటోంది. వాషింగ్టన్‌లో కొన్ని ప్రాంతాల్లోనూ, కెంటకీ, అలబామా, టెక్సాస్‌ రాష్ట్రాల చుట్టుపక్కల ఈ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులే ఈ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే ఆ విద్యార్థి పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తాడు. ఆ పార్టీకి కరోనా రోగులు, ఆరోగ్యంగా ఉన్నవారు అందరూ వస్తారు.

అక్కడ కరోనా టికెట్లు అమ్మకానికి పెడతారు. ఆ పార్టీలో పాల్గొన్న వారిలో ఎవరికి మొదట వైరస్‌ సోకితే టికెట్లు అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రైజ్‌ మనీగా ఇస్తారు. ఇదీ ఇప్పుడు అక్కడ నడుస్తోన్న ప్రమాదకరమైన ట్రెండ్‌. ‘‘గత కొద్ది వారాలుగా వీకెండ్‌లలో ఎక్కడ చూసినా ఇవే పార్టీలు జరుగుతున్నాయి. మొదట ఇదంతా తప్పుడు వార్తలని అనుకున్నాను. కానీ విచారణ జరిపిస్తే నిజమేనని తేలింది. యువత ఇంత అజ్ఞానంలో ఉన్నందుకు చాలా విచారంగా ఉంది. ఈ పార్టీలుS జరగకుండా చర్యలు మొదలు పెట్టాం’’అని అలబామా ఆరోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ పార్టీలతో కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్ర గవర్నర్‌ కె ఇవె సెప్టెంబర్‌ 9 వరకు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు.  

ఎందుకీ పైత్యం ?  పార్టీకి వెళ్లాడు, ప్రాణాలు కోల్పోయాడు 
కోవిడ్‌–19 పార్టీకి వెళ్లిన టెక్సాస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మెథాడిస్ట్‌ ఆస్పత్రి వైద్యుడు జేన్‌ యాపిల్‌బై వెల్లడించారు. కరోనా వైరస్‌ ఒకసారి వస్తే, రోగనిరోధక వ్యవస్థ పెరుగుతందన్న ఉద్దేశంతో అతను పార్టీకి వెళ్లాడని, వైరస్‌ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మృత్యువు ముంచుకొస్తున్న చివరి నిమిషంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని, మరెవరూ అలా చేయొద్దన్న అవగాహన కల్పించాలంటూ ఆస్పత్రి నర్సుకి ఆ వ్యక్తి చెప్పాడని డాక్టర్‌ వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
07-08-2020
Aug 07, 2020, 17:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది....
07-08-2020
Aug 07, 2020, 16:50 IST
రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు...
07-08-2020
Aug 07, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి...
07-08-2020
Aug 07, 2020, 14:05 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు....
07-08-2020
Aug 07, 2020, 13:43 IST
న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ...
07-08-2020
Aug 07, 2020, 13:20 IST
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల...
07-08-2020
Aug 07, 2020, 12:53 IST
కోల్‌క‌తా :  కరోనా..సామ‌న్యుల నుంచి ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను సైతం బ‌లితీసుకుంటుంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి (76)...
07-08-2020
Aug 07, 2020, 11:36 IST
సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 131 మందికి...
07-08-2020
Aug 07, 2020, 11:22 IST
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
07-08-2020
Aug 07, 2020, 11:11 IST
కరోనా కేసులు 10 లక్షల మార్క్‌ దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల...
07-08-2020
Aug 07, 2020, 10:52 IST
అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్)తో కరోనా కట్టడి.
07-08-2020
Aug 07, 2020, 10:26 IST
కోవిడ్-19 కార‌ణంగా మొద‌టిసారిగా ఓ జ‌డ్జి క‌న్నుమూశారు.
07-08-2020
Aug 07, 2020, 10:10 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజులు గుడుస్తున్నకొద్దీ మునుపెన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో ​కేసులు వెలుగు...
07-08-2020
Aug 07, 2020, 09:43 IST
గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.. అసలే ఇటీవలికాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయలకు, సరుకుల కోసం...
07-08-2020
Aug 07, 2020, 09:31 IST
బత్తలపల్లి: ఆర్డీటీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ కరోనాను జయించారు. వైరస్‌ నుంచి కోలుకున్న ఆమె గురువారం ఆర్డీటీ ఆసుపత్రి...
07-08-2020
Aug 07, 2020, 08:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌...
07-08-2020
Aug 07, 2020, 08:15 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చే బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులకు కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top