జమ్మూకశ్మీర్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాది దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాది దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అరికట్టాలని పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్తో కలసి పోరాడుతామని అమెరికా ప్రకటించింది.
సరిహద్దు అవతలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ క్యాంప్ సహా పలు ప్రాంతాలపై దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఒక లెఫ్టినెంట్ కల్నల్ సహా 8 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుదాడుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.