అమెరికాలో అకాలీ నేతపై దాడి | Akali Dal Leader Dragged Beaten Up Outside A Gurdwara In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో అకాలీ నేతపై దాడి

Aug 26 2018 12:55 PM | Updated on Apr 4 2019 3:25 PM

Akali Dal Leader Dragged Beaten Up Outside A Gurdwara In US - Sakshi

గురుద్వారా వెలుపల దాదాగిరీ..

న్యూయార్క్ :  అకాలీ దళ్‌ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు మంజీత్‌ సింగ్‌పై అమెరికాలోని కాలిఫోర్నియాలో గురుద్వార వెలుపల దాడి జరిగింది. మంజీత్‌పై దాడికి పాల్పడిన దుండగులు గురుద్వార నుంచి ఆయనను బయటకు ఈడ్చుకువచ్చి దారుణంగా కొట్టారు. తనపై 20 మందికి పైగా దాడికి తెగబడ్డారని, పవిత్ర గురుద్వార వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం విచారకరమని మంజీత్‌ పేర్కొన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై ప్రతిదాడికి దిగవద్దని తన అనుచరులను వారించానని, సంయమనంతో వ్యవహరించాలని సూచించానన్నారు.

కాగా దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజీత్‌పై దాడి ఘటనను శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ లోంగోవాల్‌ ఖండించారు. అమెరికాలో సిక్కులపై దాడులు పునరావృతమవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంజీత్‌ సింగ్‌పై దాడి గర్హనీయమని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్‌ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఖండించారు.మరోవైపు సోమవారం న్యూయార్క్‌లోని ఓ టీవీ స్టూడియో వద్ద డీఎస్‌జీఎంసీ చీఫ్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఖలిస్తాన్‌ సానుభూతిపరులు దాడి చేయడం కలకలం రేపింది. అమెరికాలో సిక్కులపై విద్వేష దాడులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement