విరాళాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు చారిటీలు, లాభాపేక్షలేని సంస్థలకు సాయపడే కొత్త ఫీచర్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ అందుబాటులోకి తెచ్చింది.
హూస్టన్ : విరాళాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు చారిటీలు, లాభాపేక్షలేని సంస్థలకు సాయపడే కొత్త ఫీచర్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ అధునాతన ఫీచర్‌ను అమెరికాలోని చారిటీ సంస్థలతోపాటు ఇకమీదట వ్యక్తిగత యూజర్లు సైతం వాడుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ‘ఫండ్‌రైజర్స్’ ఫీచర్ అమెరికాలోని ఒక శాతం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని, వచ్చే కొద్దివారాల్లో మొత్తం అమెరికన్లకు ఈ ఫీచర్‌ను పరిచయంచేస్తామని సంస్థ తెలిపింది. ఎన్జీఓలు నేరుగా ఫేస్‌బుక్ నుంచి విరాళాలు పొందొచ్చు.