బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి | 24 killed in coal mine fire in China | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి

Nov 26 2014 9:24 AM | Updated on Sep 2 2017 5:10 PM

ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

బిజీంగ్: ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మందికిపైగా మరణించారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని వెల్లడించారు. ఈ కంపెనీలో దాదాపు 5000 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement