పిల్ల కాదు పిడుగు.. దెబ్బకు పరుగు తీశాడు

11 Year Old Kicks Man Who Attempts To Theft Mothers Scooter - Sakshi

అర్జెంటీనా : తల్లి స్కూటర్‌ను దొంగలించాలని చూసిన ఓ వ్యక్తికి చుక్కలు చూపిందో చిన్నపిల్ల. అతడిపై పంచులు కురిపించి, ప్రాణాలకు భయపడి పరుగులుపెట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని జరేట్‌లో బుధవారం రాత్రి ఓ మహిళ తన ఇంటి సమీపంలో స్కూటర్‌పై కూర్చుని ఉంది. ఇంతలో అటువైపుగా వెళుతున్న ఓ దొంగ ఆమె వద్దకు వచ్చి, స్కూటర్‌ను లాక్కోటానికి చూశాడు. అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలో హెల్మెంట్‌ ధరించి నిలబడి ఉన్న 11ఏళ్ల ఆమె కూతురు అతడిపై విరుచుకుపడింది. ముఖంపై చేతితో పంచులుకురిపించింది. మరుక్షణంలో ఆమె తల్లి కూడా అతడిపై దాడిచేయటం ప్రారంభించింది. అనుకోని ఈ హఠాత్‌ పరిణామానికి దొంగ బిక్కచచ్చిపోయాడు. చేసేదేమీ లేక బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి పరుగులు తీశాడు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top