రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి జోస్యం చెప్పారు.
రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జయనామ సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలలో 140 నుంచి 145 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందన్నారు.
ఎన్నికల తర్వాత అనేక పార్టీలు రాజకీయ ముఖ చిత్ర పటం నుంచి కనుమరుగుకాక తప్పదన్నారు.గ్రహగతులన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.వర్షాలు సకాలంలో పడతాయని,ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు.ఎన్ని పార్టీ లు ఒక్కటైన వైఎస్ఆర్ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు.