ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ | ys jagan mohan reddy press meet on kapu kota agitation | Sakshi
Sakshi News home page

ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Feb 1 2016 11:09 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ - Sakshi

ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన వివరించనున్నారు.

తునిలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్య గర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని విపక్ష నాయకులు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement