సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోయింది.
తుఫాను ఢీకొని మహిళ మృత్యువాత
Mar 4 2017 2:51 PM | Updated on Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోయింది. చంపాపేట్ సూర్యా నగర్ కాలనీ నుంచి కర్మాన్ ఘాట్‌కు స్కూటీపై వెళ్తున్న వెంకటమ్మ(45) ను వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొనటంతో ఆమె అక్కడికక‍్కడే చనిపోయింది. ఈ మేరకు తుఫాను వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement


