యువతి వేధిస్తోందంటూ యువకుడి ఫిర్యాదు | woman harass man over phone in Hyderabad, case filed | Sakshi
Sakshi News home page

యువకుడిని వేధిస్తున్న యువతి..

Sep 12 2017 6:18 PM | Updated on Sep 19 2017 4:26 PM

యువతి వేధిస్తోందంటూ యువకుడి ఫిర్యాదు

యువతి వేధిస్తోందంటూ యువకుడి ఫిర్యాదు

సాధారణంగా సెల్‌ఫోన్‌లో తమను పురుషులు వేధిస్తున్నారంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు.

సాక్షి, హైదరాబాద్‌ : సాధారణంగా సెల్‌ఫోన్‌లో తమను పురుషులు వేధిస్తున్నారంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే తనను ఓ యువతి సెల్‌ఫోన్‌లో వేధిస్తున్నదంటూ ఓ యువకుడు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ -14లో నివసించే ఎన్‌. సతీష్‌ అనే యువ వ్యాపారికి గత రెండేళ్ల నుంచి ఫోన్‌లో నెట్‌ కాలింగ్‌ ద్వారా అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫోన్లు వస్తున్నాయి.

అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే పరువు తీస్తానంటూ ఆ యువతి బెదిరింపులకు పాల్పడుతోంది. ఇంతకూ మీరెవరంటూ సతీష్‌ ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆమె సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో విసుగు చెందిన అతడు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆదేశించడంతో సెక్షన్‌ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement