మహిళను చితకబాదిన స్మగ్లర్లు | woman attacked by smugglers | Sakshi
Sakshi News home page

మహిళను చితకబాదిన స్మగ్లర్లు

Oct 10 2015 8:58 AM | Updated on Sep 3 2017 10:44 AM

నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై గంజాయి స్మగ్లర్లు దాడి చేశారు.

హైదరాబాద్ : నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.  ఓ మహిళపై గంజాయి స్మగ్లర్లు దాడి చేశారు. ఈ దాడిలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం... నేరేడ్మెట్ ప్రాంతంలో ఇటీవల గంజాయి తాగుతున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆ గంజాయి మత్తులో రహదారిపై వెళ్తున్న వారిని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాంతో స్థానికంగా గంజాయి సేవించే వారిపై ఓ మహిళ ఇటీవల పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో ఆగ్రహించిన గంజాయి స్మగ్లర్లు ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement