హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నవారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పూల దండలు వేసి ఘనంగా సత్కరించారు.
బంజారాహిల్స్ : హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నవారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పూల దండలు వేసి ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీకృష్ణానగర్‌లో హెల్మెట్ ధారణపై యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్‌గౌడ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్లు ధరించకుండా వాహనాలు నడుపుతున్నవారిని ఆపి... దాని వల్ల కలిగే నష్టాలను వివరించారు. హెల్మెట్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. చట్టపరంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు.