నా కొడుకు నిర్దోషి: విజయరామారావు | vijayarama rao comments on son's bank cheating case | Sakshi
Sakshi News home page

నా కొడుకు నిర్దోషి: విజయరామారావు

Feb 24 2016 5:49 PM | Updated on Sep 3 2017 6:20 PM

నా కొడుకు నిర్దోషి: విజయరామారావు

నా కొడుకు నిర్దోషి: విజయరామారావు

కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుమారుడు శ్రీనివాస్పై కేసులు నమోదు చేశారని సీబీఐ మాజీ డైరెక్టర్ కే. విజయరామారావు తెలిపారు.

హైదరాబాద్: కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుమారుడు శ్రీనివాస్పై కేసులు నమోదు చేశారని సీబీఐ మాజీ డైరెక్టర్ కె.విజయరామారావు అన్నారు. త్వరలోనే తన కుమారుడి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన బుధవారమిక్కడ తెలిపారు.  కేసు నమోదు చేసినే విషయం వాస్తవమే అని, అయితే ఈ కేసుకు శ్రీనివాస్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకంగా పేర్కొన్న విజయరామారావు.. నిజానిజాలను కోర్టులో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. ఇప్పటి వరకు తాను ఈ విషయంలో సీబీఐని సంప్రదించలేదని కేవలం ప్రొసీడింగ్స్ మాత్రం చూశానని ఆయన వెల్లడించారు. తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం శ్రీనివాస్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement