ఉన్న సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకని కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శించారు.
'సచివాలయం ఎలా కడతారో చూస్తా'
Sep 7 2017 3:35 PM | Updated on Sep 19 2019 8:28 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతిలో కొత్త భవంతులు కడుతున్నారని కేసీఆర్ కూడా కొత్తవి కట్టాలని అనుకుంటున్నారు. ఉన్న సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా సొమ్మును ఖర్చు పెట్టడానికి మీ జాగీరా? సచివాలయం ఎలా కడతారో నేను చూస్తా? కొత్త సచివాలయంపై నగరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. ప్రజల ముదు బ్యాలెట్ పేపర్ పెడతామని అన్నారు.
Advertisement


