దద్దమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది: దాసోజు | tpcc spokes person dasoju sravan fires on trs governament | Sakshi
Sakshi News home page

దద్దమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది: దాసోజు

Published Fri, Feb 5 2016 1:32 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

చట్టసవరణ చేయాలంటే చట్టసభల ద్వారానే చేయాలనే కనీస నిబంధనలు తెలియని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

హైదరాబాద్:  చట్టసవరణ చేయాలంటే చట్టసభల ద్వారానే చేయాలనే కనీస నిబంధనలు తెలియని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 207 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం అర్డినెన్స్ను తీసుకురావడం చీకటి రాజకీయం అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా.. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అధికారులంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బానిసలుగా మారారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చట్టసభలని, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హేతుబద్ధమైన జీవో అని న్యాయస్థానానికి చెప్పిన ప్రభుత్వం దానిని రాత్రికి రాత్రే ఎందుకు రద్దుచేసిందని ఆయన ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement