ఇంజాపూర్లో దొంగలు బీభత్సం | thieves hulchul in vanasthalipuram | Sakshi
Sakshi News home page

ఇంజాపూర్లో దొంగలు బీభత్సం

Oct 1 2016 6:40 AM | Updated on Aug 28 2018 7:30 PM

వనస్థలిపురం ఇంజాపూర్లో శుక్రవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

హైదరాబాద్: వనస్థలిపురం ఇంజాపూర్లో శుక్రవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పురాతన శ్రీవెంకటేశ్వరస్వామి వారి  ఆలయంలో దొంగలు చోరీ చేశారు. ఆ క్రమంలో అడ్డువచ్చిన వాచ్మెన్పై దాడి చేశారు. పురాతన పంచలోహ విగ్రహాలను అపహరించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాలు చాలా పురాతనమైనవి అని స్థానికులు తెలిపారు. సొత్తు విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా ఇదే తరహాలో ఈ దేవాలయంలో చోరీలు జరిగాయని.. ఆ విగ్రహాలు ఇప్పటికీ రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement