హోటల్‌లో నగదు చోరీ: క్యాషియర్ అరెస్ట్ | theft in hyderabad hotel cashier arrested | Sakshi
Sakshi News home page

హోటల్‌లో నగదు చోరీ: క్యాషియర్ అరెస్ట్

Dec 16 2016 6:38 PM | Updated on Aug 29 2018 7:09 PM

పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఓ వ్యక్తిని ఎల్‌బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

హైదరాబాద్: నమ్మకంగా పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఓ వ్యక్తిని ఎల్‌బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కింగ్‌కోఠికి చెందిన ఎండీ షరీఫ్ సాగర్ రింగురోడ్డులోని గ్రీన్ బావర్చీ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 28వ తేదీన హోటల్ నుంచి రూ.50 వేలు తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని మేనేజర్‌కు చెప్పాడు. దీంతో హోటల్ నిర్వాహకులు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగతనం చేసింది క్యాషియరే అని తేల్చారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి రూ.50 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement