బంజారాహిల్స్ లో గజం రూ. 80 వేలు | telangana notification for govt lands auction | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్ లో గజం రూ. 80 వేలు

Oct 30 2015 8:14 PM | Updated on Sep 4 2018 5:07 PM

బంజారాహిల్స్ లో గజం రూ. 80 వేలు - Sakshi

బంజారాహిల్స్ లో గజం రూ. 80 వేలు

నిరుపయోగంగా పడివున్న ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.

హైదరాబాద్: నిరుపయోగంగా పడివున్న ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేయనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీచేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గజం ధర రూ. 80 వేలుగా నిర్ధారించింది.

వివాదాలులేని విలువైన ప్రభుత్వ భూములు గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రాజీవ్ శర్మ గతంలోనే ఆదేశించారు.  ప్రభుత్వ భూముల వేలం విషయాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా ప్రభుత్వం గుర్తించింది. కాగా, నిరుపయోగంగా పడివున్న ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.

Advertisement
 
Advertisement
Advertisement