తెలంగాణ వ్యాప్తంగా 251 మంది జీవిత ఖైదులను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 251 మంది జీవిత ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. చర్లపల్లి జైలు నుంచి 49 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 39 మంది, చంచల్గూడ రెండు జైళ్ల నుంచి 35 మంది ఖైదీలు విడుదలయ్యారు.
పలు కేసుల్లో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వారిని మంగళవారం విడుదల చేశారు. విడుదలైన ఖైదీలలో 1992లో హైదరాబాద్ లో సంచలన సృష్టించిన ఏసీసీ హత్యకేసు నిందితుడు కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్ కూడా ఉన్నాడు. ఖైదీల విడుదల కావడంతో జైళ్ల పరిసరా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఖైదీలు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.