అలా చేయకపోతే పోటీకి అనర్హులు! | Telangana govt issued a notice on amendements of Municiapl law | Sakshi
Sakshi News home page

అలా చేయకపోతే పోటీకి అనర్హులు!

Sep 21 2016 4:30 PM | Updated on Oct 16 2018 7:36 PM

మున్సిపల్ చట్టంలో సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

హైదరాబాద్: మున్సిపల్ చట్టంలో సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో సవరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ వార్డుల్లో ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థి.. ఉపసంహరణ గడువులోగా ఒక వార్డు మినహా మిగిలిన చోట పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందంటూ తాజా ఉత్తర్వులో పేర్కొంది. అలా చేయని పక్షంలో ఆయా వార్డుల్లో అభ్యర్థి పోటీకి అనర్హుడవుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement