'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం' | telangana congress mlas fires on governor speech in assembly | Sakshi
Sakshi News home page

'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం'

Mar 10 2016 1:12 PM | Updated on Mar 18 2019 7:55 PM

'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం' - Sakshi

'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం'

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసినా ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, చిన్నారెడ్డిలు ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసినా ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, చిన్నారెడ్డిలు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీపై ప్రస్తావనే చేయలేదన్నారు.

వృద్ధిరేటు విషయంలో ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే దాని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వామని వారు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement