ఆగిన కేశినేని బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు | Technical problem in kesineni travels bus | Sakshi
Sakshi News home page

ఆగిన కేశినేని బస్సు : ప్రయాణికులు ఇక్కట్లు

May 17 2015 8:28 AM | Updated on Sep 3 2017 2:14 AM

హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన కేశినేని ట్రావెల్స్కు చెందిన బస్సులో శనివారం అర్థరాత్రి సాంకేతికలోపం ఏర్పడింది.

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన కేశినేని ట్రావెల్స్కు చెందిన బస్సులో శనివారం అర్థరాత్రి సాంకేతికలోపం ఏర్పడింది.  దాంతో బీదర్ సమీపంలో బసవ కల్యాణం వద్ద బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. దాంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు చర్యలు తీసుకోవడం కానీ... ప్రత్యామ్నాయంగా మరో బస్సును  ఏర్పాటు చేయడం కానీ ట్రావెల్స్ యాజమాన్యం చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసిన సదరు ట్రావెల్స్ ... తమను నడి రోడ్డుపై నిలిపి చోద్యం చూస్తుందని ప్రయాణికులు కేశినేనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement