బీజేపీతో పొత్తా...అయితే మేం ఒప్పకోం | TDP leaders advice to Chandrababu naidu | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తా...అయితే మేం ఒప్పకోం

Mar 27 2014 12:31 PM | Updated on Jul 29 2019 2:44 PM

బీజేపీతో పొత్తా...అయితే మేం ఒప్పకోం - Sakshi

బీజేపీతో పొత్తా...అయితే మేం ఒప్పకోం

రానున్న ఎన్నికలలో బీజేపీతో పొత్తును టీడీపీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

రానున్న ఎన్నికలలో బీజేపీతో పొత్తును టీడీపీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు నన్నపనేని రాజకుమారి, కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం.

ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా రెండు సార్లు లేఖలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ పలు ఇబ్బందుల్లో పడిందని,అట్లాంటి పార్టీ మళ్లీ విభజనకు సహకరించిన బీజేపీతో పొత్తు అంటే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడమే అని ఆ సదరు నేతలు చంద్రబాబుకు తలంటినట్లు తెలిసింది. బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో...ప్రజలకు మనం ఏలాంటి సందేశం ఇస్తున్నామో ఓ సారి సమీక్షించుకోవాలని ఆ ముగ్గురు నేతలు చంద్రబాబుకు హితవుపలికారు. బీజేపీతో టీడీపీ పొత్తు తమకు సుతరాము ఇష్టం లేదని నన్నపనేని, కోడెల, సోమిరెడ్డిలు చంద్రబాబు వద్ద కుండబద్దలు కోట్టినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement