తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ? | T. Harish Rao takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ?

Apr 3 2014 11:57 AM | Updated on Sep 27 2018 5:59 PM

తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది  ? - Sakshi

తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబు...తెలంగాణ అమర వీరులు గురించి మాట్లాడడం సిగ్గూచేటుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే అధిక సీట్లు గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ హారీష్ రావు ఈ సందర్బంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు.

ఎన్నికలో గెలవలేక బీజేపీతో పొత్తు కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారని చంద్రబాబుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకునేందుకు క్యాడర్ భయపడుతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఆయన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండేవాడు కాదంటూ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement