ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ‘రూల్స్’: శ్రవణ్ | Sravan on Rules Committee | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ‘రూల్స్’: శ్రవణ్

Mar 3 2016 3:39 AM | Updated on Jul 29 2019 6:58 PM

ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ‘రూల్స్’: శ్రవణ్ - Sakshi

ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ‘రూల్స్’: శ్రవణ్

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకర్ పునఃసమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డి.శ్రవణ్ డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకర్ పునఃసమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డి.శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను గవర్నర్ ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతలు ఈటల, హరీశ్‌రావు, కేటీఆర్ పోటీపడి బెంచీలెక్కి, గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపేశారన్నారు. కాగా, మాజీ స్పీకర్ డి.శ్రీపాదరావు జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, శ్రవణ్ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement