ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ | six more IPS officers transfered in Telangana | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ

May 22 2016 4:47 AM | Updated on Sep 4 2017 12:37 AM

ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం దాదాపు 24 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరుగురిని బదిలీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం దాదాపు 24 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరుగురిని బదిలీ చేసింది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్‌గా ఉన్న వై.నాగిరెడ్డి నార్త్‌జోన్ ఐజీగా బదిలీ అయ్యారు.  వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న బి.మల్లారెడ్డికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించారు.

సీసీఎస్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న టి.ప్రభాకర్‌రావును వరంగల్ రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. అయితే నార్త్ జోన్ ఐజీగా ఉన్న నవీన్‌చంద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా నవీన్‌చంద్‌కు సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క వెయిటింగ్‌లో ఉన్న షానవాజ్ ఖాసీంను ఖమ్మం ఎస్పీగా, ప్రస్తుతం ఖమ్మం ఎస్పీగా ఉన్న రమా రాజేశ్వరిని మహబూబ్‌నగర్ ఎస్పీగా బదిలీ చేసింది.
 
ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటరామారావును ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహాయ మునిసిపల్ కమిషనర్‌గా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ కె.గంగారాంను బాదేపల్లి నగర పంచాయతీ కమిషనర్‌గా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement