హైదరాబాద్- టర్కీ విమాన సర్వీసుల రద్దు | Shamshabad airport officials suspends Turkey bound servieses | Sakshi
Sakshi News home page

హైదరాబాద్- టర్కీ విమాన సర్వీసుల రద్దు

Jun 29 2016 8:20 AM | Updated on Oct 2 2018 7:37 PM

ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు.

హైదరాబాద్: ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న పది మంది పట్టుబడిన నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్, రాక్సా, ఎయిర్‌పోర్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement