ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు | SC Residential colleges admissions | Sakshi
Sakshi News home page

ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

May 19 2016 12:52 AM | Updated on Sep 4 2017 12:23 AM

తమ గురుకులాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి(2016-17) ఆన్‌లైన్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తమ గురుకులాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి(2016-17) ఆన్‌లైన్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూ జిల్లాల వారీగా రూపొందించే మెరిట్ జాబితాకు అనుగుణంగానే విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

కాలేజీలను కూడా మెరిట్ ఆధారంగానే కేటాయిస్తారని, ఇందుకు ఎలాంటి కౌన్సెలింగ్ ఉండదని స్పష్టంచేశారు. కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులనే ఆమోదిస్తామని, విడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దీనికై ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement