రూ. 2 కోట్ల విలువైన ఎన్నికల మద్యం స్వాధీనం | Rs 2 crore worth election liquor seized in Hyderabad | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన ఎన్నికల మద్యం స్వాధీనం

Jan 29 2016 6:05 PM | Updated on Sep 5 2018 3:24 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్‌ ఎన్నిలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్‌ ఎన్నిలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గ్రేటర్‌ పీఠం తమదంటే తమదేనని పలుపార్టీలు ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే జోరుగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల మద్యం ఏరులైపారుతోంది.  నగరంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 15 లక్షల 28 వేల 200 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 86వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement