అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..! | Hero Vijay Dont Make Mistakes in Politics With His Personal Life issues | Sakshi
Sakshi News home page

Vijay: విజయ్ అలా చేస్తే.. తన పతనాన్ని కోరుకోవడమే..!

May 6 2026 5:06 PM | Updated on May 6 2026 6:36 PM

Hero Vijay Dont Make Mistakes in Politics With His Personal Life issues

సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్‌ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.

ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.

త్రిష ఎంట్రీతో విజయ్‌కి దెబ్బ..

రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్‌పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్‌కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు  తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్  రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.

వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరు

తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం.  అక్కడ విజయ్‌ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్‌కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది.  ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్‌ లైఫ్‌ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్‌కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement