మాజీ పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ | robbery in former police officer's home | Sakshi
Sakshi News home page

మాజీ పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ

Jun 30 2016 3:12 PM | Updated on Aug 30 2018 5:27 PM

మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు.

హైదరాబాద్: మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉండే రిటైర్డు అడిషనల్ ఎస్పీ హరీష్‌చంద్ర కుటుంబసభ్యులతో సహా ఊరికెళ్లారు. ఇదే అదనుగా ఇంట్లోకి చొరబడిన దుండగులు 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, చీరలు దోచుకెళ్లినట్టు సమాచారం. గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హరీష్ చంద్రకు సమాచారం అందించారు. బాధితులు వస్తేనే ఎంత సొత్తు చోరీ జరిగిందో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement