పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై నాలుగు కార్లు ఢీ | Road accident at PV Narasimha rao expressway | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై నాలుగు కార్లు ఢీ

Aug 9 2017 3:16 PM | Updated on Aug 30 2018 4:10 PM

నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరామ్‌ఘర్‌ చౌరస్తా సమీపంలో బుధవారం మధ్యాహ్నం పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్తున్న నాలుగు కార్లు ఒకదాని వెనుక ఒకటి కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ క్రమబద్దీకరిస్తున్నారు. భారీ వర్షం కారణంగా రహదారి సరిగ్గా కనిపించక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement