ర్యాలీని అడ్డుకోవడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు.
'కేసీఆర్ పతనం మొదలైంది'
Feb 22 2017 4:04 PM | Updated on Sep 5 2017 4:21 AM
హైదరాబాద్: నిర్బంధాలతో నిరుద్యోగుల ఆకాంక్షలను అణిచివేయడానికి చూస్తే కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని.. శాంతియుతంగా చేపట్ట తలచిన ర్యాలీని అడ్డుకోవడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ ర్యాలీకి వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని.. దీనికి కేసీఆర్ సర్కార్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పరిపాలించాలని చూసిన వారెవరు చరిత్రలో మిగల్లేదని ఆయన మండిపడ్డారు.
Advertisement
Advertisement