unemployeed rally
-
'కేసీఆర్ పతనం మొదలైంది'
హైదరాబాద్: నిర్బంధాలతో నిరుద్యోగుల ఆకాంక్షలను అణిచివేయడానికి చూస్తే కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని.. శాంతియుతంగా చేపట్ట తలచిన ర్యాలీని అడ్డుకోవడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ ర్యాలీకి వెళ్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని.. దీనికి కేసీఆర్ సర్కార్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పరిపాలించాలని చూసిన వారెవరు చరిత్రలో మిగల్లేదని ఆయన మండిపడ్డారు. -
నిరుద్యోగ ర్యాలీ: ఎక్కడికక్కడ అరెస్టులు
-
నిరుద్యోగ ర్యాలీ: ఎక్కడికక్కడ అరెస్టులు
హైదరాబాద్: టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతిలేదంటున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయలు దేరాడానికి యత్నించిన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వైస్ చైర్మన్ విమలక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఉన్న మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉద్రిక్తత మరోవైపు ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఓ ఎస్సైకి గాయాలయ్యాయి. జేఏసీ ర్యాలీకి మద్దతుగా టీఎస్ఎఫ్(తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్) నాయకులు ఆందోళన చేస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని డీసీఎం వాహనంలో అక్కడి నుంచి తరలిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఎల్బీ నగర్ ఎస్సైగా పని చేస్తున్న నరేందర్ డీసీఎం పై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. -
కోర్టుకు వెళ్లి ర్యాలీకి అనుమతి తెచ్చుకోవాలా?
-
కోర్టుకు వెళ్లి ర్యాలీకి అనుమతి తెచ్చుకోవాలా?
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యను ప్రైవేటీకరణ వైపు ప్రోత్సహిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్ విద్యను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గురుకుల పాఠశాలలు.. కేజీ టూ పీజీ కి ప్రత్యామ్నాయం కావాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో 15 శాతం వరకు విద్యకు బడ్జెట్ కేటాయింపులు ఉంటే.. మన రాష్ట్రంలో కేవలం 8 శాతానికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటీఫికేషన్స్ కేవలం పేపర్‌కే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగులు ర్యాలీ చేపట్టాలనుకుంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్య పాలనా.. లేక రాచరికపు పాలనా అని ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు. ఈ పరిణామాలు సిగ్గుచేటన్నారు. పోలీసులు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందో కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు సర్కార్ బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డి ..ఉత్తమ్ ఎపిసోడ్ ముగిసిన అధ్యాయమని.. ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు తెలిపారు.