రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా విద్యను ప్రైవేటీకరణ వైపు ప్రోత్సహిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్ విద్యను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. గురుకుల పాఠశాలలు.. కేజీ టూ పీజీ కి ప్రత్యామ్నాయం కావాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో 15 శాతం వరకు విద్యకు బడ్జెట్ కేటాయింపులు ఉంటే.. మన రాష్ట్రంలో కేవలం 8 శాతానికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటీఫికేషన్స్ కేవలం పేపర్‌కే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగులు ర్యాలీ చేపట్టాలనుకుంటే దానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదన్నారు.