టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతిలేదంటున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయలు దేరాడానికి యత్నించిన యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వైస్ చైర్మన్ విమలక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఉన్న మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.