ఏప్రిల్‌ ఆఖరుకల్లా అందరికీ రేషన్‌ కార్డులు | Ration cards for all by the end of April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ ఆఖరుకల్లా అందరికీ రేషన్‌ కార్డులు

Mar 22 2018 12:48 AM | Updated on Mar 25 2019 3:09 PM

Ration cards for all by the end of April - Sakshi

రాష్ట్రంలో 75 వేల మందికి రేషన్‌ కార్డులను క్లియర్‌ చేశారని, మిగతా వారికి ఏప్రిల్‌ నెలాఖరులోగా ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ పద్దుపై చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. ఈపాస్‌ సమస్యలను పరిష్కరిస్తామని, వేలిముద్రలు పడకపోయినా రేషన్‌ ఇమ్మని చెప్పామని తెలిపారు.

వారికి ఐరిష్‌కు లింకు చేయమని సూచించామన్నారు. ప్రజలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే రేషన్‌ బియ్యం తీసుకునే విధానం తెచ్చామన్నారు. కిరోసిన్‌ వినియోగం ప్రస్తుతం తగ్గిందని, 100 శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి పూర్తిగా తగ్గిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement