‘టీవీ షోలకు నిర్మాతలదే బాధ్యత’ | producers are responsible for TV show, says anuradharao | Sakshi
Sakshi News home page

‘టీవీ షోలకు నిర్మాతలదే బాధ్యత’

Jun 3 2017 6:13 PM | Updated on Sep 5 2017 12:44 PM

‘టీవీ షోలకు నిర్మాతలదే బాధ్యత’

‘టీవీ షోలకు నిర్మాతలదే బాధ్యత’

టీవీలో ప్రసారమైన షోను అనుకరిస్తూ ఓ బాలుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

హైదరాబాద్‌: టీవీలో ప్రసారమైన షోను అనుకరిస్తూ ఓ బాలుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అనంతరం కాలిన గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. జయదీప్‌ అనే బాలుడు ఓ చానల్ లో ప్రసారమైన షో చూస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయాడు. జయదీప్ మృతికి కార్టూన్‌ షో నిర్మాతలు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

రియాల్టీ షోలతో పాటు కొన్ని టీవీ షోలను బాధ్యతారాహిత్యంగా చిత్రీకరించడంతో హైదరాబాద్‌ నగరంలోనే ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయని చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం జాతీయ బాలల హక్కుల కమిషన్‌లో పిటీషన్‌ దాఖలు చేస్తూ బాధ్యతరహితమైన టీవీ షోలు, రియాల్టీ షోలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. సదరు చానల్‌ నిర్మాతలపై కేసులు నమోదు చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement