నల్లగా, గలీజ్‌గా ఉందన్నారు.. అమ్మ ఘోరంగా ఏడ్చింది : జబర్ధస్త్‌ ఫైమా | Jabardasth Faima Shares Her Career Starting Struggles, Get Emotional | Sakshi
Sakshi News home page

అలాంటి వాళ్లకు గడ్డి మందు ఇవ్వాలి.. అప్పుడు ఆ బాధ తెలుస్తుంది : ఫైమా

Apr 8 2026 6:39 PM | Updated on Apr 8 2026 6:46 PM

Jabardasth Faima Shares Her Career Starting Struggles, Get Emotional

వచ్చే జన్మలో అయినా ఆడపిల్లగా కాకుండా మగాడిగా పుట్టాలని అంటోంది జబర్ధస్త్‌ ఫైమా. పటాస్‌ షోతో వెండితెరకు పరిచయం అయిన ఈ లేడి కమెడియన్‌.. జబర్దస్త్‌ కామెడీ షోతో బాగా పాపులర్‌ అయింది. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో దూసుకెళ్తుంది. అయితే కెరీర్‌ ప్రారంభంలో మాత్రం ఫైమా చాలా అవమనాలను ఎదుర్కొందట. నల్లగా ఉందంటూ కొంతమంది ట్రోల్‌ చేశారట. తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొన్న ఫైమా.. తన కెరీర్‌ గురించి.. పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అమ్మ ఘోరంగా ఏడ్చింది..
కెరీర్‌ ప్రారంభంలో చాలా అవమనాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకు నాకు హైప్‌ వచ్చింది. అందరూ ‘వీ వాంట్‌ ఫైమా’ అని అంటుంటే..కొందరు మాత్రం ‘ఏముంది దీనిలో అంత పొడుగుతున్నారు. గలీజ్‌గా, నల్లగా ఉంది’ అని ట్రోల్‌ చేశారు.  నాతో పాటు మా అక్కలు కూడా అవి చూసి బాధపడ్డారు. ఒక రోజు నేను మా అమ్మకు ఫోన్‌ చేసి ‘ఎందుకు అమ్మ నన్ను ఇంత నల్లగా కన్నావు’ అని అడిగా. అప్పుడు అమ్మ ఘోరంగా ఏడ్చింది.

కొత్త డ్రెస్‌ కోసం ఏడ్చేదాన్ని
మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వేసుకోవడానికి సరైన డ్రెస్‌లు కూడా ఉండేవి కాదు. ఇంటి పక్కనవాళ్లు కొత్త డ్రెస్‌ వేసుకుంటే ఏడ్చేదాన్ని. మేం మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం.నేనే అందరికంటే చిన్నదాన్ని. వాళ్లు వేసుకున్న డ్రెస్సులే నాకు ఇచ్చేవాళ్లు. ఎప్పుడైనా డ్రెస్‌ కొనుక్కోవాల్సి వస్తే.. నలుగురు అక్కలకు కొనుక్కున్న డ్రెస్‌ ముక్కల నుంచి ఒక్కొక్కటి ఇచ్చి నాకు కొత్త డ్రెస్‌ కుట్టించేవాళ్లు. ఇప్పుడు అలా కుట్టించుకుంటే ఫ్యాషన్‌ అంటున్నారు(నవ్వుతూ..).

గడ్డి మందు ఇచ్చి చంపాలి..
ఇక చిన్న పిల్లలపై జరుగున్న అఘాయిత్యాల గురించి ఫైమా మాట్లాడుతూ..‘అలాంటి పనులు చేసినవాళ్లను గడ్డి మందు ఇచ్చి చంపాలి.  చనిపోయే ముందు అయినా ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. నాను పవర్స్‌ ఇస్తే అలానే చేస్తా. ఒక ఆడపిల్లగా జీవించడం చాలా కష్టం. ఆడపిల్లగా పుట్టినందుకు నేను అస్సలు హ్యాపీగా లేను. మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్లగా బతకడం. చాలా కష్టాలు ఉంటాయి. వచ్చే జన్మలోనైనా నేను మగాడిలా పుట్టాలని కోరుకుంటున్నాను’ అని ఫైమా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement