షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా | Private travels bus turns in Maharastra, several passengers injured | Sakshi
Sakshi News home page

షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Jul 16 2014 8:59 AM | Updated on Sep 4 2018 5:07 PM

షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా - Sakshi

షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు.

హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్  ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో  సుమారు 12మంది ప్రయాణికులు  గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement