సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు | police officers transfer in Cyberabad Commissionerate | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు

Oct 8 2016 1:35 PM | Updated on Aug 21 2018 7:26 PM

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలివీ.. దుండిగల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని జీడిమెట్లకు, శంషాబాద్ డివిజన్ డీఐగా పనిచేసే బొల్లం శంకరయ్యను దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే, సైబర్ క్రైం విభాగంలో ఉన్న బాల కృష్ణారెడ్డిని బాచుపల్లి పీఎస్‌కు, వీఆర్‌లో ఉన్న పుష్పన్‌కుమార్‌ను శంషాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement