వరి.. సరి.. | Paddy cultivation discreas in telangana | Sakshi
Sakshi News home page

వరి.. సరి..

Jan 1 2015 3:47 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఈ సారి రబీలో రైతులు వరి వైపు చూడలేదు. రబీలో సహజంగా 6.5 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది.

 రాష్ట్రంలో రబీలో తగ్గిన సాగు

సాక్షి, హైదరాబాద్: ఈ సారి రబీలో రైతులు వరి వైపు చూడలేదు. రబీలో సహజంగా 6.5 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది. ఈ సారి ఇప్పటివరకు 45 వేల హెక్టార్లలోనే వరి సాగు చేశారు. నీటి వనరులు ఉన్నచోటే వరి సాగు జరి గింది. ఎక్కువగా జొన్న పంట వేశారు. ఆరుతడి పంటలే వేయాలని వ్యవసాయ శాఖ చేసిన ప్ర చారం ఫలితాన్నిచ్చింది. రబీలో 61 వేల హెక్టార్లలో జొన్న సాగు చేయాల్సి ఉండగా 48 వేల హెక్టార్లలో సాగు చేశారు.
 
 మొక్కజొన్న 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 99 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఆహారధాన్యాలు 10.41 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండ గా 2.98 లక్షల హెక్టార్లలోనే సాగయింది. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇదిలావుండగా వర్షపాత లోటు తీవ్రంగా ఉండడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రబీ సీజన్‌లో (బుధవారం నాటికి) 61 శాతం వర్షపాత లోటు నమోదైంది. అంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు ఛాయలు రాష్ట్రాన్ని కమ్మేశాయని వ్యవసాయశాఖ నివేదిక లో స్పష్టంచేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement