రైల్వే ట్రాక్ పనుల్లో అపశ్రుతి | One killed in accident while railway track work in secunderabad | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్ పనుల్లో అపశ్రుతి

Oct 17 2016 10:10 AM | Updated on Aug 25 2018 5:39 PM

నగరంలోని బాలనగర్ ఫిరోజ్గూడ రైల్వే ట్రాక్ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది.

హైదరాబాద్ : నగరంలోని బాలనగర్ ఫిరోజ్గూడ రైల్వే ట్రాక్ పనుల్లో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు విరిగిపడి ఓ రైల్వే కార‍్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.

కాగా ఈ ప్రమాద ఘటనపై అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement