కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి | one dies in road accident at nagole | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Dec 18 2016 11:27 AM | Updated on Aug 30 2018 4:10 PM

కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి - Sakshi

కారును ఢీకొన్న లారీ: ఒకరి మృతి

ఉప్పల్-నాగోల్ మార్గంలో హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్-నాగోల్ మార్గంలో హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కారు సర్వీసింగ్ కోసం శనివారం ఉప్పల్ వచ్చారు. సర్వీసింగ్ పూర్తయ్యాక తిరిగి వెళ్తుండగా ఉప్పల్ మెట్రో వద్ద వీరి కారును వెనుకనుంచి లారీ ఢీకొంది. ఐదుగురు తీవ్రంగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నాగరాజ్ అనే వ్యక్తి మృతిచెందాడు.

కారు డ్రైవర్ రాములు(50), వంశీ(23)ల పరిస్థితి విషమంగా ఉంది. అతి వేగంగా వచ్చిన లారీ తమ వెనుక నుంచి ఢీకొందని రాములు, వంశీ తెలిపారు. లారీ డ్రైవర్ పరారు కాగా కారులోని ఓ యువకుడు కనిపించడంలేదు. ఉప్పల్ పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement