రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్సే | MLC Karne Prabhakar fires on Congress Party | Sakshi
Sakshi News home page

రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్సే

Aug 17 2016 3:03 AM | Updated on Mar 18 2019 9:02 PM

రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్సే - Sakshi

రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్సే

కాంగ్రెస్ పాలనలో పా పాలే రైతుల ఉసురు తీశాయని, ఇప్పుడు తీరిగ్గా వారు రైతు గర్జన పేర నాటకాలు ఆడుతున్నారని...

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో పా పాలే రైతుల ఉసురు తీశాయని, ఇప్పుడు తీరిగ్గా వారు రైతు గర్జన పేర నాటకాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నా రు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అధికారంలో ఉండగా నీటిపారుదల రంగాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement