ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర | MLA Sandra to the ACB special court on vote for cash case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర

Apr 1 2017 12:21 AM | Updated on Aug 29 2018 7:31 PM

ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.

మరోవైపు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement