డ్వాక్రా మహిళలను నిండా ముంచారు | Mla gouru charitha reddy fires on government | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలను నిండా ముంచారు

Mar 27 2016 1:14 AM | Updated on Oct 30 2018 4:29 PM

డ్వాక్రా మహిళలను నిండా ముంచారు - Sakshi

డ్వాక్రా మహిళలను నిండా ముంచారు

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం

 ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

 సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వారిని నిండా ముంచిందని విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు.శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. గత రెండు బడ్జెట్లలో మహిళలకు అన్యాయం చేశారని.. ఈ బడ్జెట్‌లోనూ నిరాశే మిగిల్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మహిళలను మరింత చిక్కుల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement