ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ | Minister Harish Rao meeting with AG | Sakshi
Sakshi News home page

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ

Oct 29 2016 2:56 AM | Updated on Sep 2 2018 5:24 PM

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ - Sakshi

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ

నీటి పారుదల, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలోని తన కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలోని తన కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా కార్యదర్శి రాజా సదారాం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఈ నెల 8 కల్లా తెలపాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో హరీశ్ ఏజీతో సమావేశమైనట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు, అవసరమైన న్యాయ సలహా తీసుకునేందుకు ఏజీని అసెంబ్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. కాగా, స్పీకర్ మధుసూదనచారి స్థానికంగా లేకపోవడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే స్పీకర్ కూడా ఇప్పటికే ఏజీని న్యాయ సలహా కోరినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర రాష్ట్రాల స్పీకర్లు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement