చారిటీ స్పెషల్.. మెరిసిన డైనింగ్ హాల్ | Marina Dining Hall Charity Special .. | Sakshi
Sakshi News home page

చారిటీ స్పెషల్.. మెరిసిన డైనింగ్ హాల్

Mar 11 2016 12:09 AM | Updated on Sep 3 2017 7:26 PM

చారిటీ స్పెషల్..  మెరిసిన డైనింగ్ హాల్

చారిటీ స్పెషల్.. మెరిసిన డైనింగ్ హాల్

చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గురువారం రాత్రి విభిన్న కార్యక్రమానికి వేదికైంది.

చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గురువారం రాత్రి విభిన్న కార్యక్రమానికి వేదికైంది. నవాబుల కాలం నుంచి పసందైన విందుకు వేదికైన ఆ టేబుల్ చుట్టూ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డైనింగ్, ఫ్యాషన్‌తో కూడిన ఈ కార్యక్రమం చారిటీ కోసం నిర్వహించడం ఆసక్తికరం. సామాజిక సేవా దృక్పథంతో తలపెట్టిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ యంగ్ నటీనటులు కదిలి వచ్చారు. సుస్మితాసేన్ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన ఆమె బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సామాజిక సంస్థ ‘టీచ్ ఫర్ చేంజ్’ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో వేడుకలా సాగింది. ఫ్యాషన్‌షోలో శిల్పారెడ్డి డిజైన్ చేసిన దుస్తులు, మానేపల్లి నగలతో టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ మెరిసిపోయారు. లక్ష్మి మంచు, సినీనటి లావణ్య త్రిపాఠి.. శిల్పారెడ్డి డిజైన్ చేసిన దుస్తులు, ఫలక్‌నామా ప్యాలెస్‌లో తానొక రాకుమారిలా మారిపోయానని మురిసిపోయారు. ‘భల్లాలదేవ’ రానా మహారాజులా వెలిగిపోయారు. - సాక్షి, సిటీబ్యూరో
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement