breaking news
	
		
	
  Models walk the ramp
- 
            
                                     
                                                           
                                   
                బంజారాహిల్స్లో మోడల్స్...ఫొటోలకు పోజులిస్తూ సందడి (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            బంజారాహిల్స్లో మోడల్స్...ఫొటోలకు పోజులిస్తూ సందడి (ఫొటోలు)
 - 
            
                                     
                                                           
                                   
                విజయవాడ : బంగారు ఆభరణాల ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
 - 
  
    
                
      ముంబైలో అట్టహాసంగా బొంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్
 - 
            
                                     
                                                           
                                   
                విజయవాడ: చేనేత ఫ్యాషన్ షో మోడల్స్ క్యాట్ వాక్ అదరహో (ఫొటోలు)
 - 
            
                                     
                                                           
                                   
                మోడల్ హంట్.. ఫ్యాషన్ ఈవెంట్
 - 
            
                                     
                                                           
                                   
                మిస్ ఐకానిక్
 - 
      
                   
                               
                   
            చారిటీ స్పెషల్.. మెరిసిన డైనింగ్ హాల్

 చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గురువారం రాత్రి విభిన్న కార్యక్రమానికి వేదికైంది. నవాబుల కాలం నుంచి పసందైన విందుకు వేదికైన ఆ టేబుల్ చుట్టూ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డైనింగ్, ఫ్యాషన్తో కూడిన ఈ కార్యక్రమం చారిటీ కోసం నిర్వహించడం ఆసక్తికరం. సామాజిక సేవా దృక్పథంతో తలపెట్టిన ఈ ఈవెంట్కు టాలీవుడ్ యంగ్ నటీనటులు కదిలి వచ్చారు. సుస్మితాసేన్ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్లోనే పుట్టిపెరిగిన ఆమె బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
 
 సామాజిక సంస్థ ‘టీచ్ ఫర్ చేంజ్’ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ తాజ్ ఫలక్నుమా హోటల్లో వేడుకలా సాగింది. ఫ్యాషన్షోలో శిల్పారెడ్డి డిజైన్ చేసిన దుస్తులు, మానేపల్లి నగలతో టాలీవుడ్ నటీనటులు, మోడల్స్ మెరిసిపోయారు. లక్ష్మి మంచు, సినీనటి లావణ్య త్రిపాఠి.. శిల్పారెడ్డి డిజైన్ చేసిన దుస్తులు, ఫలక్నామా ప్యాలెస్లో తానొక రాకుమారిలా మారిపోయానని మురిసిపోయారు. ‘భల్లాలదేవ’ రానా మహారాజులా వెలిగిపోయారు. - సాక్షి, సిటీబ్యూరో
 
 


